Hari Hara Veera Mallu: ఆయన టార్చ్ వేస్తే నేను నడిచా

పవర్ కళ్యాణ్(Pawan Kalyan) హీరోగా నటిస్తున్న సినిమాల్లో ఎంతో ప్రతిష్టాత్మకమైన హరిహర వీరమల్లు(Hari Hara Veera Mallu) కూడా ఒకటి. కరోనాకు ముందు మొదలైన ఈ సినిమా ఇప్పటికీ రిలీజవలేదు. రీసెంట్ గానే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రెండు భాగాలుగా రానుంది. అయితే హరిహర వీరమల్లు మొదటి పార్ట్ జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ కు టైమ్ దగ్గర పడటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను స్టార్ట్ చేసింది.
ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్ సినిమాలోని అసుర హననం అనే సాంగ్ ను ప్రెస్ మీట్ పెట్టి రిలీజ్ చేసి అందులో సినిమా గురించి పలు విషయాలను తెలిపారు. వీరమల్లు సినిమాకు ప్రధాన కారణం క్రిష్(Krish) అని, ఆయన టార్చ్ లైట్ వేసిన బాటలో తాను నడిచి సినిమాను పూర్తి చేశానని, పవన్ కళ్యాణ్ ను డైరెక్ట్ చేయడమే తనకు అవార్డుతో సమనమని డైరెక్టర్ జ్యోతికృష్ణ(Jyothi Krishna) తెలిపాడు.
నిధి అగర్వాల్(Niddhi Agerwal) మాట్లాడుతూ, వీరమల్లు సినిమా తనకెంతో స్పెషల్ అని, ఈ సినిమా మొదలు పెట్టినప్పటికీ, ఇప్పటికీ తనలో ఎన్నో మార్పులొచ్చాయని, తాను పవన్ కళ్యాణ్ కు వీరాభిమానినని నిధి అగర్వాల్ తెలిపింది. ఇక మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి(Keeravani) మాట్లాడుతూ వీరమల్లు సినిమా పవన్ కళ్యాణ్ మాత్రమే చేయగలిగే సినిమా అని, ఆయనొక మూర్తీభవించిన ధర్మగ్రహమని అన్నాడు.