JSK: ఓటీటీ రిలీజ్ కు రెడీ అయిన అనుపమ సినిమా
అనుపమ పరమేశ్వరన్(anupama parameswaran), సురేష్ గోపీ(suresh gopi) ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా జానకి వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ(Janaki v Vs state of Kerala). ప్రవీణ్ నారాయణ(praveen narayana) దర్శకత్వం వహించిన ఈ మూవీ కేరళలో జరిగిన రియల్ సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. రిలీజ్ కు ముందు ఎన్నో వివాదాలను ఎదుర్కొన్న ఈ సినిమా వాటన్నింటినీ ఎదుర్కొని జులై 17న థియేటర్లలోకి వచ్చింది.
బాక్సాఫీస్ వద్ద ఓ మోస్తరు ఫలితాన్ని అందుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ రిలీజ్ కు రెడీ అయింది. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5(Zee5)లో ఈ మూవీ ఆగస్ట్ 15 నుంచి స్ట్రీమింగ్ కానుంది. వాస్తవానికి ఈ సినిమా జూన్ 27న రిలీజ్ కావాలి. కానీ సెన్సార్ బోర్డు అభ్యంతరం వల్ల సినిమా జులై 17న మలయాళంలో మాత్రమే రిలీజైంది. అదే టైమ్ లో తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా వస్తుందనుకున్నారు కానీ రాలేదు.
ఆగస్ట్ 8న ఈ సినిమా తెలుగులో రిలీజ్ కానుండగా దాని తర్వాత వారం రోజుల్లోపే ఈ మూవీ ఓటీటీలోకి రానుంది. ఆగస్ట్ 15 నుంచి జానకి వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ మలయాళంతో పాటూ తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో కూడా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో శృతి రామచంద్రన్(Shruthi Ramachandran), మాధవ్ సురేష్(madhav suresh), దివ్య పిల్లై(divya pillai) కీలక పాత్రల్లో నటించారు.







