Harish Shankar: పవన్ కెరీర్లోనే బెస్ట్ ఇంటర్వెల్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(pawan kalyan), డైరెక్టర్ హరీష్ శంకర్(harish shankar) కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ఉస్తాద్ భగత్‌సింగ్(Ustaad Bhagath singh). ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు రేకెత్తిస్తోంది. షూటింగ్ దాదాపు పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఇప్పటికే రిలీజైన టీజర్, సాంగ్స్ కు సోషల్ మీడియాలో మంచి స్పందన లభించడంతో సినిమాపై హైప్ మరింత పెరిగింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మాస్ లుక్, యాక్షన్ ఎలిమెంట్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపుతున్నాయి.
ఇవి కూడా చదవండి
ఇటీవల ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్న దర్శకుడు హరీష్ శంకర్ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఈ చిత్రంలోని ఇంటర్వెల్ సీన్ గురించి మాట్లాడిన ఆయన, ఇది పవన్ కళ్యాణ్ కెరీర్లోనే బెస్ట్ ఇంటర్వెల్ బ్లాక్ అవుతుందని అన్నారు. గతంలో తమ కాంబినేషన్లో వచ్చిన గబ్బర్ సింగ్(Gabbar singh) సినిమాలో పవన్‌ను ఎలా ప్రెజెంట్ చేశామో అందరికీ తెలుసని, అయితే ఆ లెవల్‌ను మించి ఈ సినిమాలో పవన్‌ను మరింత మాస్‌గా చూపించామని వెల్లడించారు.
పవన్ కళ్యాణ్‌పై తనకు ఉన్న ప్రత్యేక అభిమానం వల్లే ఆయనను స్క్రీన్‌పై మరింత పవర్‌ఫుల్‌గా చూపించాలని ప్రయత్నించానని హరీష్ శంకర్ చెప్పారు. ప్రేక్షకులు సినిమా చూసిన తర్వాత పవన్ కళ్యాణ్‌ను ఇంత మాస్‌గా చూపించగల దర్శకుడు హరీష్ శంకర్ మాత్రమే అని అనాల్సిందేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలతో ఉస్తాద్ భగత్ సింగ్ పై అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి.
ఇవి కూడా చదవండి






