Ghaati: ఘాటీ ఏదోటి తేల్చేస్తే బెటర్!
హరి హర వీరమల్లు(Hari Hara veeramallu) సినిమా లేటవుతుందని ఆ సినిమా నుంచి పక్కకు వచ్చిన డైరెక్టర్ క్రిష్(Krish), వెంటనే అనుష్క(anushka) తో సినిమాను మొదలుపెట్టి చాలా వేగంగా ఆ షూటింగ్ ను పూర్తి చేశాడు. షూటింగైతే పూర్తి చేశాడు కానీ ఇప్పటివరకు ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది లేదు. ఇప్పటికే ఘాటీ(Ghaati) సినిమా పలు మార్లు పోస్ట్‌పోన్ అయింది.
ఏప్రిల్ 18, జులై 11న రిలీజ్ అవుతుందని అన్నప్పటికీ ఆ రెండు డేట్స్ లోనూ సినిమా రాలేదు. ఆ రెండు డేట్స్ లో ఏ రోజు వచ్చినా సినిమాకు మంచి ఓపెనింగ్స్ దక్కేవి. కానీ వాటిని ఘాటీ మిస్ చేసుకుంది. సినిమా రిలీజ్ కు లేట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్, వీఎఫ్ఎక్స్ అంటున్నప్పటికీ ఘాటీకి అంత రేంజ్ వీఎఫ్ఎక్స్ అవసరం లేదని అందరికీ తెలిసిన విషయమే.
ఇప్పుడు మళ్లీ సెప్టెంబర్ 5న ఘాటీ వస్తుందంటున్నారు కానీ అది కూడా అయ్యేలా కనిపించడం లేదు. అదే రోజున తేజ సజ్జ(teja Sajja) మిరాయ్(Miraai) రిలీజ్ కానుంది. ఏదేమైనా ఘాటీ రిలీజ్ డేట్ విషయంలో అటు నిర్మాణ సంస్థ కానీ, ఇటు డైరెక్టర్, హీరోయిన్ కానీ నోరు మెదపకపోవడంతో ఎప్పటికప్పుడు ఘాటీ రిలీజ్ సస్పెన్స్ సినిమాను తలపిస్తోంది. ఇప్పటికైనా రిలీజ్ డేట్ విషయంలో ఓ క్లారిటీ వస్తే సినిమాకు బజ్ తగ్గకుండా ఉంటుంది.







