Rajiv Roy: మాఫియా బెదిరింపులతో ఇండస్ట్రీకి, ఇండియాకు దూరమైన డైరెక్టర్

బాలీవుడ్ ఇండస్ట్రీకి, బాలీవుడ్ సినిమాలు చూసే ఆడియన్స్ కు రాజీవ్ రాయ్(Rajiv Roy) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. పలు సినిమాలతో బాలీవుడ్ లో మంచి హిట్లు అందుకున్న ఆయన స్టార్ డైరెక్టర్ గా ఎదిగారు. అలాంటి స్టార్ డైరెక్టర్ నుంచి అనుకోకుండా రెండు డిజాస్టర్లు రావడం, ఆ తర్వాత ఇండస్ట్రీని, దేశాన్ని వదిలి వెళ్లిపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి.
ఇన్నేళ్ల తర్వాత రీసెంట్ గా ఇండియాకు తిరిగొచ్చిన రాజీవ్ రాయ్, మాఫియా బెదిరింపుల వల్లే తాను ఇండస్ట్రీకి దూరమైనట్టు తెలిపాడు. యుధ్(Yudh) సినిమాతో డైరెక్టర్ గా డెబ్యూ మూవీ చేసిన ఆయన ఆ సినిమాతో యావరేజ్ అనిపించుకున్నారు. ఆ తర్వాత నాలుగేళ్లకు త్రిదేవ్(Tridev) సినిమాతో బ్లాక్ బస్టర్ ను అందుకున్నారు. తర్వాత విశ్వాత్మ(Viswatma) అనే సినిమాతో కమర్షియల్ హిట్ అందుకున్నారు.
1994లో వచ్చిన మెహ్రా(Mehra) అయితే ఎన్ని కలెక్షన్లు అందుకుందో చెప్పే పన్లేదు. ఆ మూవీ సక్సెస్ ఇచ్చిన కాన్ఫిడెన్స్ తో బాబీ డియోల్(bobby deol) తో కలిసి గుప్త్(gupth) అనే సినిమా చేసి అందరినీ ఎట్రాక్ట్ చేశారు. అయితే సూపర్ ఫామ్ లో ఉన్న రాజీవ్ పై అప్పుడే మాఫియా కన్ను పడి ఆయనకు బెదిరింపులు మొదలయ్యాయి. పోలీసులు ఎంత సెక్యూరిటీ ఇచ్చినా ఆయన ఆఫీసులపై దాడులు జరిపారు. వాటి వల్ల డిస్ట్రబ్ అయిన రాజీవ్ నుంచి తర్వాత ఎవరూ ఊహించని సినిమాలొచ్చి అవి డిజాస్టర్లయ్యాయి. దీంతో ఇండస్ట్రీని, ఇండియాను వదిలి విదేశాలకు వెళ్లిపోయారు రాజీవ్. రీసెంట్ గా ఇండియాకొచ్చిన ఆయన ఈ విషయాన్ని చెప్పడంతో పాటూ ప్రస్తుతం తాను రెండు సినిమాలు చేస్తున్నట్టు తెలిపారు. మరి గతంలో లాగానే మరోసారి రాజీవ్ బ్లాక్ బస్టర్లను అందుకోగలరేమో చూడాలి.