Devara: ఏడాది తర్వాత టీవీలోకి రాబోతున్న దేవర

ఈ రోజుల్లో ఓటీటీ, శాటిలైట్ రైట్స్ కు మంచి డిమాండ్ ఏర్పడిందనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద లాస్ వచ్చినా ఓటీటీ, శాటిలైట్ రైట్స్ ద్వారా వచ్చే డబ్బుతోనే సేఫ్ అవుతున్నాయి. అందులో స్టార్ హీరోల సినిమాలు కూడా ఉన్నాయి. అంత డిమాండ్ ఉన్నప్పటికీ గతేడాది రిలీజైన ఓ స్టార్ హీరో సినిమాకు మొన్నటివరకు శాటిలైట్ రైట్స్ కు అమ్ముడుపోలేదు.
ఆ సినిమానే దేవర(Devara). ఎన్టీఆర్(NTR) హీరోగా కొరటాల శివ(Koratala Siva) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా శాటిలైట్ రైట్స్ రీసెంట్ గానే అమ్ముడయ్యాయి. సినిమా రిలీజైన ఏడాది తర్వాత దేవర శాటిలైట్ రైట్స్ ను స్టార్ గ్రూప్ సొంతం చేసుకుంది. అయితే దేవర సినిమా తెలుగులో కంటే ముందు హిందీ వెర్షన్ లో టెలికాస్ట్ కానుంది. అక్టోబర్ 26న స్టార్ గోల్డ్(Star Gold) లో దేవర ప్రసారం కానుంది.
దీపావళి తర్వాత దేవర తెలుగు వెర్షన్ స్టార్ మా లో టెలికాస్ట్ కానున్నట్టు సమాచారం. మామూలుగా సినిమా రిలీజ్ కు ముందే శాటిలైట్ రైట్స్ అమ్ముడవుతున్న ఈ రోజుల్లో.. నిర్మాతలు భారీ రేటు చెప్పడం వల్లే దేవర శాటిలైట్ రైట్స్ అమ్ముడవలేదని చెప్పగా, రిలీజ్ కు ముందు మేకర్స్ డిమాండ్ చేసిన రేటులో సగం రేటుకే ఇప్పుడు స్టార్ మా దేవర హక్కులను సొంతం చేసుకుందని వార్తలొస్తున్నాయి. మరి ఈ వార్తల్లో నిజమెంతనేది చూడాలి.