Assembly: ఈ నెల 29 నుంచి అసెంబ్లీ సమావేశాలు!
కృష్ణా, గోదావరి జలాలపై చర్చించేందుకు ఈ నెల 29 నుంచి అసెంబ్లీ(Assembly) సమావేశాలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ప్రాజెక్టులు, నీటి కేటాయింపులు, రాష్ట్ర విభజన తర్వాత ప్రాజెక్టులపై చేసిన వ్యయం ఇలా అన్ని అంశాలపై సమగ్రంగా చర్చించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) యోచిస్తున్నట్లు సమాచారం. కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులందరితో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. మొదటి పంచాయతీ ఎన్నికల్లో ఉత్తమ ఫలితాలు సాధించారంటూ మంత్రుల (Ministers)ను సీఎం అభినందించారు. పంచాయతీ ఫలితాల గురించి చర్చించిన తర్వాత సాగునీటి ప్రాజెక్టులు, కృష్ణా గోదావరి బేసిన్లలో పరిస్థితి, తాజాగా పాలమూరు` రంగారెడ్డి ఎత్తిపోతల గురించి మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడిన అంశాలపై వివరింగా చర్చించినట్లు తెలిసింది. వచ్చే ఫిబ్రవరి లో మున్సిపల్ ఎన్నికలు (Municipal elections) నిర్వహించాలని, ఓటర్ల జాబితాలో సవరణల అనంతరం తుది నిర్ణయం తీసుకోవాలని అనుకున్నట్లు సమచారం.






