KTR: తెలంగాణలో నడుస్తోందని ప్రజాపాలన కాదు.. మాఫియా పాలన : కేటీఆర్
తెలంగాణలో నడుస్తోందని ప్రజాపాలన కాదని, పక్కా మాఫియా పాలన అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. నాడు ఎన్నికల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project)పై బాంబులు వేశారని, నేడు ఇసుక మాఫియా కోసం చెక్‌డ్యామ్‌ల మీద జిలెటిన్ స్టిక్స్ వేస్తున్నారని ఆరోపించారు. ఇది మానవ నిర్మిత విధ్వసంమని వాటన్ మ్యాన్ రాజేంద్రసింగ్ (Rajendra Singh) మొత్తుకుంటున్నా, ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదన్నారు. డ్రిల్లింగ్ మెషీన్లతో రంధ్రాలు చేసి జిలెటిన్ స్టిక్స్ పెట్టి పేల్చారని ఆయన సాక్ష్యాలతో సహా నిరూపించారు. ఇసుకను దోచుకోవడానికి అడ్డుగా ఉన్నాయని, రూ.కోట్ల ప్రజాధనంతో నిర్మించిన చెక్‌డ్యామ్‌లను డైనమైట్లు పెట్టి పేల్చేస్తారా? భూగర్భ జలాలు పెరగాలని మేం చెక్‌డ్యామ్‌లు కడితే, వాటిని కూల్చివేసి రైతుల పొలాలను ఎడారిగా మారుస్తున్నారు. ఇసుక కాంట్రాక్టర్ల లాభాల కోసం తెలంగాణ (Telangana) రైతులు బలి కావాలా? ప్రకృతి విపత్తులతో కూలిపోయాయని కట్టుకధలు అల్లిన కాంగ్రెస్జీఖ మంత్రులకు రాజేంద్రసింగ్ రిపోర్టు చెంపపెట్టు అని పేర్కొన్నారు.






