Deepika Padukone: కల్కి2 నుంచి దీపిక వాకౌట్

దీపికా పదుకొణె(deepika padukone). తన నిర్ణయాలతో పలు భారీ ప్రాజెక్టులను వదులుకుంటుంది. ఆల్రెడీ సందీప్ రెడ్డి వంగా(sandeep reddy vanga) దర్శకత్వంలో ప్రభాస్(prabhas) హీరోగా తెరకెక్కనున్న స్పిరిట్(spirit) కోసం ముందు దీపికానే అనుకుంటే, వర్కింగ్ అవర్స్(Working Hours) కారణంగా దీపికా ఆ భారీ పాన్ ఇండియా సినిమాను వదులుకుంది. ఇప్పుడు తాజాగా మరో తెలుగు సినిమా నుంచి కూడా దీపికా ఎగ్జిట్ ఇచ్చింది.
అదే కల్కి2(kalki2). పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా గతేడాది వచ్చిన భారీ బ్లాక్ బస్టర్ కల్కి 2898ఏడి(kalki2898AD)లో దీపికా పదుకొణె సుమతి(Sumathi) అనే కీలక పాత్రలో నటించి టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. మొదటి తెలుగు సినిమాతోనే దీపికా తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకోగా, కల్కి2 లో కూడా దీపికా పాత్ర ఉంటుందని ఇప్పటికే చిత్ర యూనిట్ చెప్పుకుంటూ వచ్చింది.
కానీ ఇప్పుడు తాజాగా కల్కి2 లో దీపికా నటించడం లేదని స్వయంగా నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్(Vyjayanthi movies) పోస్ట్ చేస్తూ కన్ఫర్మ్ చేసింది. కల్కి2 లాంటి సినిమాకు మరింత కమిట్మెంట్ అవసరమవుతుందని, అందుకే తమ దారులు వేరయ్యాయని చెప్తూ నిర్మాణ సంస్థ పోస్ట్ చేయగా, ఆ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. అయితే దీపికా వదులుకున్న రెండు సినిమాలూ ప్రభాస్వే కావడం విశేషం.
https://x.com/VyjayanthiFilms/status/1968553829848195285