Daku Maharaj: బాలయ్య కెరీర్లోనే ఎక్కువ బిజినెస్!

బాలకృష్ణ(Balakrishna) హీరోగా బాబీ(Bobby Kolli) దర్శకత్వంలో తెరకెక్కిన డాకు మహారాజ్(Daku Maharaj) సినిమా ఈ నెల 12న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలయ్య కెరీర్లోనే భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా ప్రమోషన్స్ ను మరింత పెంచనుంది చిత్ర యూనిట్. ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏపీలో చేయడానికి అన్ని సన్నాహాలు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే డాకు మహారాజ్ కు ప్రీ రిలీజ్ బిజినెస్ ఇప్పటికే పూర్తైనట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటూ ఓవర్సీస్ బిజినెస్ డీల్స్ కూడా క్లోజ్ అయ్యాయట. నైజాం హక్కులను దిల్ రాజు(Dil Raju) సొంతం చేసుకోగా, ఓవర్సీస్ రైట్స్ ను శ్లోక ఎంటర్టైన్మెంట్స్, రాధాకృష్ణ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా తీసుకున్నాయి.
ఆంధ్రాలో ఈ సినిమాకు రూ.40 కోట్లకు బిజినెస్ జరగ్గా, సీడెడ్ లో భారీ మొత్తానికే హక్కులు అమ్ముడైనట్లు తెలుస్తోంది. మొత్తానికి బాలయ్య కెరీర్లో ఎక్కువ మొత్తంలో ప్రీ రిలీజ్ బిజినెస్ ఈ సినిమాకే జరిగినట్లు చెప్తున్నారు. వాల్తేరు వీరయ్య(Waltair Veerayya) తర్వాత బాబీ దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడం, హ్యాట్రిక్ హిట్స్ తర్వాత బాలయ్య(Balayya) నటిస్తున్న సినిమా కావడంతోనే ఈ సినిమాకు ఇంత హైప్ ఏర్పడింది. ట్రైలర్ రిలీజ్ తర్వాత డాకు మహారాజ్ పై ఉన్న అంచనాలు ఇంకా పెరగడం ఖాయం.