Charmmee Kaur: చాన్నాళ్లకు మరింత చార్మింగ్ ఛార్మీ

ఒకప్పుడు టాలీవుడ్ లో గ్లామరస్ హీరోయిన్ గా పలు సినిమాలు చేసి మంచి క్రేజ్ తెచ్చుకున్న చార్మీ కౌర్(Charmmee Kaur), ఇప్పుడు చాలా రోజుల తర్వాత తన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. చార్మీ తన బర్త్ డే సందర్భంగా ఓ ఫోటోను అప్ లోడ్ చేయగా ఆ ఫోటోలో చార్మీ మరింత అందంగా, ఎనర్జిటిక్ గా కనిపించి అందరినీ ఎట్రాక్ట్ చేస్తుంది. చార్మీ షేర్ చేసిన ఫోటోలో బ్లాక్ అండ్ వైట్ డ్రెస్ లో మరింత చార్మింగ్ గా, స్టైలిష్ గా కనిపించి ఆకట్టుకుంటుంది. చార్మీ షేర్ చేసిన ఈ ఫోటోకు ఆమె ఫాలోవర్లు విషెస్ చెప్తూ ఆ ఫోటోను వైరల్ చేస్తున్నారు.