కూకట్పల్లిలో బాహుబలి బృందం
సినీ ప్రేక్షకలోకం రెండేళ్లుగా ఎప్పుడెప్పుగా అని ఎదురుచూస్తున్న వెండితెర దృశ్యకావ్యం బాహుబలి-2 ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లోనూ బాహుబలి ప్రదర్శిస్తున్న థియేటర్ల వద్ద పండుగ వాతావరణం నెలకొంది. కూకట్పల్లి లోని శ్రీ భ్రమరాంబ థియేటర్ వద్ద బాహుబలి బృందం సందడి చేసింది. దర్శకుడు రాజమౌళి, ఆయన భార్య రమ, హీరోయిన్ అనుష్క, కీరవాణి దంపతులు, ఇతర బృంద సభ్యులు థియేటర్లో ప్రేక్షకులతో కలిసి చిత్రాన్ని వీక్షించారు. టిక్కెట్ కోసం థియేటర్ వద్ద బారులు తీరిన ప్రేక్షకులు చిత్ర బృందాన్ని చూసి ఆనందానికి గురయ్యారు. కొందరు రాజమౌళి వద్దకు వెళ్లి కరచాలనం చేశారు.













