యానిమల్ ఇంటర్వెల్పై ఇంట్రెస్టింగ్ బజ్
యానిమల్ సినిమా కోసం ఆడియన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఇవాళ హైదరాబాద్ లో జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత ఈ హైప్ మరింత పెరగడం ఖాయం. రిలీజ్ కు మరో ఐదు రోజులే ఉండటంతో చిత్ర యూనిట్ మొత్తం సినిమాను తెగ ప్రమోట్ చేస్తుంది. ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయాల్ని చెప్తున్నారు చిత్ర యూనిట్ మెంబర్స్.
రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో సందీప్ రెడ్డి వంగా సోదరుడు ప్రణయ్ యానిమల్ సినిమా పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. యానిమల్ ఇంటర్వెల్ 18 నిమిషాల పాటూ ఉండనుందట. ట్రైలర్ లాస్ట్ లో రణ్బీర్ కపూర్ సిక్కుల గెటప్ లో ఉన్న అనుచరులను తీసుకొచ్చి మెషీన్ గన్ తో విధ్వంసం సృష్టించేది ఈ ఇంటర్వెల్ బ్లాక్ లోనేనట.
అంతేకాదు ఆ ఇంటర్వెల్ బ్లాక్ కు సుప్రీమ్ సుందర్ కంపోజ్ చేసిన ఫైట్ హాలీవుడ్ స్టాండర్డ్స్ లో ఉంటుందని యూనిట్ సభ్యులు చెప్తున్నారు. ఇవన్నీ వింటుంటే ఎప్పుడెప్పుడు యానిమల్ సినిమా చూస్తామా అన్నంత ఆసక్తి పెరిగిపోతుంది. ఇప్పటికే భారీ హైప్ సొంతం చేసుకున్న యానిమల్కు పాజిటివ్ టాక్ వస్తే, ఇక బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల ఊచకోత మామూలుగా ఉండదు. రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా లో అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.













