Anasuya: 30 లక్షల మందిని బ్లాక్ చేశా
యాంకర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసి ఆ తర్వాత నటిగా మారిన అనసూయ(Anasuya) సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారనే విషయం తెలిసిందే. అనసూయ చేసే పోస్టులు, కామెంట్స్ వల్ల ఆమెపై భారీ నెగిటివిటీ కూడా వస్తుంటుంది. అయితే రీసెంట్ గా ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న అనసూయ తనపై వచ్చే నెగిటివిటీ, ట్రోలింగ్స్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
సోషల్ మీడియాలో తనపై ఎక్కువగా నెగిటివిటీ వస్తుంటుందని, ఎవరైనా తన పోస్టులకు అభ్యంతరకంగా కామెంట్ చేస్తే వెంటనే వాళ్లను బ్లాక్ చేస్తానని, ఇప్పటివరకు తాను 30 లక్షల మందిని బ్లాక్ చేసి ఉంటానని, నెటిజన్ల కామెంట్స్ కు రియాక్ట్ అయ్యి ఇక భరించలేకనే నా లైఫ్ లో నువ్వు లేవు అనుకుని బ్లాక్ చేశానంటూ అనసూయ ఆ ఇంటర్వ్యూలో చెప్పింది.
అయితే అనసూయ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, ఆమె కామెంట్స్ ను నెటిజన్లు మరోసారి విమర్శిస్తున్నారు. ఆమెకు ఉన్నది కేవలం 20 లక్షలు మాత్రమే అయినప్పుడు 30 లక్షల మందిని ఎలా బ్లాక్ చేసిందంటూ కామెంట్స్ చేస్తుండగా, ఆమెను ఇంటర్వ్యూ చేసి యాంకర్ దానికి రెస్పాండ్ అయ్యి, ప్రతీ విషయాన్నీ ట్రోల్ చేయాల్సిన పన్లేదని, ఆమె చెప్పిన నెంబర్ తప్పైనా ఆమె ఫేస్ చేస్తున్న నెగిటివిటీ మాత్రం నిజమేనని, కనీసం ఆమెకు ఓ వ్యక్తిగా అయినా గౌరవమిస్తే బావుంటుందని అన్నాడు.







