Pawan Kalyan: సినిమాలకు పవన్ గుడ్ బై..!

ఏపీ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు గుడ్ బాయ్ చెప్పడానికి రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. 2024 లో అధికారంలోకి వచ్చిన తర్వాత, పవన్ కళ్యాణ్ ఒక సినిమా రిలీజ్ చేశారు. అధికారిక కార్యక్రమాల్లో బిజీగా ఉండటంతో సినిమాలపై ఎక్కువగా ఫోకస్ చేయలేకపోతున్నారు. దానికి తోడు ప్రతిపక్షాలకు ఈ విషయంలో అవకాశం ఇచ్చినట్లుగానే ఉంటుంది. ఇటీవల హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించి కాస్త వివాదం కూడా అయిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఇక సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ప్రస్తుతం సుజిత్(Sujith) డైరెక్షన్ లో ఆయన ఓ సినిమాలో నటించారు. ఓ జీ(OG) అనే టైటిల్ తో వస్తున్న ఈ సినిమా ఈనెల 25వ తారీఖున రిలీజ్ కాబోతోంది. ఇక హరీష్ శంకర్ డైరెక్షన్ లో మరో సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకోవడానికి రెడీగా ఉంది. మరో నెల రోజులు షూటింగ్ చేస్తే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా దాదాపుగా కంప్లీట్ అయిపోయే అవకాశం ఉంది. ఆ తర్వాత రెండు, మూడు కథలు పవన్ కళ్యాణ్ వద్ద ఉన్నా సరే.. ఇప్పట్లో సినిమా వద్దని పవన్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
రాజకీయంగా అవకాశం ఇవ్వకూడదని పవన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దానికి తోడు పార్టీ బలోపేతంపై 2024 తర్వాత పవన్ కళ్యాణ్ పెద్దగా దృష్టి పెట్టలేదు. వైసీపీ నుంచి వచ్చిన కొంతమంది నాయకులు మినహా, ఆయన క్షేత్రస్థాయిలో పర్యటనలు కూడా చేయలేదు. అటు కార్యకర్తల్లో కూడా పార్టీ బలోపేతంపై అనేక అనుమానాలు ఉన్నాయి. ముఖ్యంగా పిఠాపురం తో పాటుగా కొన్ని కీలక నియోజకవర్గాల్లో, జనసేన(Janasena) పార్టీ క్షేత్రస్థాయిలో ఇంకా బలపడలేదని.. కేవలం తెలుగుదేశం(TDP) పార్టీ బలం మీద లేదంటే పవన్ కళ్యాణ్ అభిమానుల బలం మీదనే నెట్టుకు వస్తున్నారనే వ్యాఖ్యలు సైతం వినపడుతున్నాయి.
త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉన్న నేపథ్యంలో, జనసేన పార్టీ తన బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. 2029 ఎన్నికల్లో మరిన్ని స్థానాల్లో పోటీ చేసే ప్రయత్నం కూడా జనసేన పార్టీ చేయాలి. అలా కాకుండా పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తూ ఉంటే రాజకీయంగా పార్టీ బలోపేతం అనేది కష్టంగా మారే అవకాశాలు సైతం ఉంటాయి. అందుకే పవన్ ఇక సినిమాలకు గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.