Vicky Kaushal: విక్కీ, కత్రీనా ఆస్తుల విలువ తెలుసా..?

బాలీవుడ్ స్టార్ జంట విక్కీ కౌశల్, కత్రీనా కైఫ్(Katrina Kaif) ఈ మధ్య కాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. చావా(Chhava) సినిమా తర్వాత విక్కీ కౌశల్ కు పాన్ ఇండియా స్టార్ గా మంచి ఇమేజ్ వచ్చింది. ఇక కత్రినా కైఫ్ మాత్రం సినిమాలకు కాస్త దూరంగా ఉంటుంది. యాడ్స్ పరంగా మాత్రం దూకుడు ప్రదర్శిస్తోంది. ఈ తరుణంలో ఈ స్టార్ జంటపై సోషల్ మీడియాలో అనేక చర్చలు జరుగుతూ ఉన్నాయి. విక్కీ కౌశల్ కంటే కత్రినా సినిమాల్లో చాలా సీనియర్. ఆమె కంటే విక్కీకి ఉన్న ఇమేజ్ చాలా తక్కువ. అయినా సరే వివాహం చేసుకుంది.
దీనితో అసలు ఈ జంట నికర ఆస్తుల విలువ ఎంత, ఇద్దరి పేరు మీద ఏయే ఆస్తులు ఉన్నాయంటూ అభిమానులు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వీరి నికర ఆస్తుల విలువ, రూ.250 కోట్లకు పైగా ఉంది. విక్కీ కౌశల్ వ్యక్తిగత ఆస్తుల నికర విలువ రూ. 41 కోట్లుగా అంచనా వేయగా, కత్రినా కైఫ్ నికర ఆస్తుల విలువ రూ. 224 కోట్లుగా ఉంది. దీనితో వారి మొత్తం నికర విలువ దాదాపు రూ. 265 కోట్లు. ఈ స్టార్ జంట జుహులో సముద్రానికి ఎదురుగా ఉన్న 7000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఇంట్లో నివసిస్తున్నారట.
దీని కోసం రూ. 1.75 కోట్ల సెక్యూరిటీ డిపాజిట్ తో దాదాపు రూ. 8-9 లక్షల అద్దె చెల్లిస్తున్నారు. వీరి పొరుగున విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ నివాసం ఉండేవారు. కత్రినా, విక్కీ ముంబైలో రూ. 17 కోట్ల విలువైన ఆస్తిని కలిగి ఉన్నారు. లండన్ లో రూ. 7 కోట్ల విలువైన విలాసవంతమైన భవనాన్ని కొనుగోలు చేసారు. వీరు ఓ ప్రముఖ బ్రాండ్ తో వ్యాపారం కూడా చేయడం విశేషం. మేకప్, కాస్మెటిక్స్ బ్రాండ్ కే బ్యూటీని మార్కెట్ లో రిలీజ్ చేసారు. 2019లో కత్రినా కైఫ్, బ్యూటీ రిటైలర్ నైకా కలిసి సంయుక్తంగా ప్రారంభించారు. ఈ బ్రాండ్ గత ఆర్ధిక సంవత్సరంలో రూ. 170 కోట్ల టర్నోవర్ చేసింది. ఈ ఏడాది ఆదాయంలో రూ. 250 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు.