యూట్యూబ్‌లో దూసుకుపోతున్న భారతీయులు
యూట్యూబ్‌లో భారతీయులు దూసుకుపోతున్నారు. ఈ ప్లాట్‌ఫాంపై ఏడు లక్షల మంది కంటెంట్ క్రియేటర్లుగా ఉపాధి పొందుతున్నారు. దేశ జీడీపీకి ఏటా రూ.6,800 కోట్లు జోడిస్తున్నారు. యూట్యూబ్, గూగుల్‌కు చెందిన ఎస్వీపీ భాగస్వామ్యంలో నిర్వహించిన సీవైఎఫ్వై 2022 సదస్సులో ఈ వివరాలను యూట్యూబ్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ నీల్ మోహన్ వెల్లడించారు. ఇండియాలో క్రియేటర్ ఎకానమీ రోజురోజుకూ వృద్ధి చెందుతున్నదని తెలిపారు. భారతదేశంలోని క్రియేటర్లంతా యూట్యూబ్‌లోనే మొదట ఎంచుకుంటున్నారని చెప్పారు. తమ ఫ్లాట్‌ఫాంలో విద్వేషం, తప్పుడు సమాచారం లేకుండా గ్లోబల్ కమ్యూనిటీ గ్రైడ్లెన్స్ను రూపొందించామని తెలిపారు.






