పేమెంట్స్ ఆప్షన్ ను ప్రవేశపెట్టిన వాట్సాప్
అద్భుతమైన ఫీచర్ను తన వినియోగదారులకు వాట్సాప్ అందించింది. అదే పేమెంట్స్ ఆప్షన్. ఈ పెమెంట్స్ ఆప్షన్ ద్వారా వాట్సాప్ నుంచి నగదును పంపుకోవడం, స్వీకరించడం చేయవచ్చు. కొన్ని నెలలుగా ఈ ఆప్షన్ పై ట్రయిల్స్ వేసిన వాట్సాప్.. చివరకు పేమెంట్స్ ఆప్షన్ ను రిలీజ్ చేసింది. అయితే ప్రస్తుతానికి ఈ ఫీచర్ను తన రెండవ అతిపెద్ద మార్కెట్ అయిన బ్రెజిల్ లో మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చింది. రానున్న రోజుల్లో ఇతర దేశాలకు కూడా ఈ సదుపాయాన్ని విస్తరింపజేసేందుకు వాట్సాప్ సన్నాహకాలు చేసుకుంటోంది. ప్రస్తుతానికి ఈ సదుపాయాన్ని వాట్సాప్ యూజర్లు ఉచితంగా వినియోగించుకోవచ్చు. బిజినెస్ పే సర్వీసుకు మాత్రం 3.99 శాతం ప్రాసెసింగ్ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. ఆరు నంబర్ల పిన్ లేదా ఫింగర్ ప్రింట్ ఫీచర్ ద్వారా లావాదేవీలను చేయవచ్చు. అంతేకాదు, వాట్సాప్ అకౌంట్ ద్వారా లింక్ చేసుకున్న వీసా లేదా మాస్టర్ కార్డ్ డెబిట్ కార్డులకు కూడా ఈ సదుపాయం సపోర్ట్ చేస్తుంది.






