71 లక్షల ఖాతాలపై వాట్సాప్ బ్యాన్

నిబంధనలు ఉల్లంఘించారంటూ 71 లక్షల మంది భారతీయ యూజర్లపై ఈ ఏడాది ఏప్రిల్ వాట్సాప్ నిషేధం విధించింది. ఖాతా దుర్వినియోగం అరికట్టడానికి, వాట్సాప్ సమగ్రతను కాపాడేందుకు నిషేధం విధించినట్టు సంస్థ తాజాగా విడుదల చేసిన నెలవారీ నివేదికలో పేర్కొన్నది. వాట్సాప్ విధానాలను ఉల్లంఘించే ఖాతాలపై చర్యలు ఇక ముందు కూడా కొనసాగుతాయని, యూజర్‌కు ఈ వేదికపై సురక్షితమైన వాతావరణాన్ని కల్పించటంలో నిరంత చర్యలు చేపడుతామని వాట్సాప్ తెలిపింది.