24 లక్షల అకౌంట్లకు షాకిచ్చిన వాట్సాప్
సోషల్ మేసేజింగ్ ప్లాట్ ఫామ్ వాట్సాప్ జూలైలో భారతదేశంలో 23.87 లక్షలకు పైగా ఖాతాలను నిషేధించింది. ఈ ఖాతాలపై వచ్చిన ఫిర్యాదులు ఆధారంగా ఈ చర్చ తీసుకుంది. మార్గదర్శకాలు, నిబంధనలను ఉల్లంఘించినందుకు ఈ ఖాతాలను బ్యాన్ చేసినట్టు ఇన్స్టంట్ మెసేజింగ్ ప్లాట్ఫాం వాట్సాప్ వెల్లడించింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్-2021 నిబంధనల కింద తాజా నివేదికలో వాట్సాప్ ఈ వివరాలను అందించింది. అలాగే యూజర్ల ఫిర్యాదులు దానిపై తాము తీసుకున్న చర్యల వివరాలు కూడా పొందుపరిచామని వాట్సాప్ తెలిపింది. ఇదే ఏడాది జూన్లో 22 లక్షలకు పైగా ఖాతాలను మేలో 19 లక్షల ఖాతాలు బ్యాన్ చేసింది.






