భారత్ లో అపార అవకాశాలు : బఫెట్

భారతీయ మార్కెట్ పట్ల అమెరికా కుబేరుడు వారెన్ బఫెట్ ఆశాజనక వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ అందిపుచ్చుకోవాల్సిన అవకాశం చాలా ఉన్నాయని తెలిపారు. తమ హోల్డింగ్ కంపెనీ బెర్క్‌షైర్ హాత్‌వే భవిష్యత్‌లో ఆ అవకాశాల్ని ఒడిసి పట్టనుందని తెలిపారు. భారత్‌లో పెట్టుబడి అవకాశాలపై కంపెనీ వార్షిక సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో వ్యాపారాలపై బెర్క్‌షైర్‌కు ఏ మేర అవగాహన ఉంది. ఆయా పెట్టుబడులను సాధ్యం చేసే పరిచయాలేమైనా ఉన్నాయా? అన్నదే ఇప్పుడు తమ ముందున్నప్రశ్న అని బఫెట్ చెప్పుకొచ్చారు. ప్రయోజనం ఉంటే కచ్చితంగా భవిష్యత్‌లో ఆయా అవకాశాల్ని అందిపుచ్చుకుంటామని తెలిపారు.