అమెరికాకు అరబిందో ఫార్మా ఔషధం
మెడ్రాగ్జిప్రోస్టెరాన్ అసిటేట్ అనే ఇంజెక్షన్‌ను అమెరికాలో విక్రయించడానికి అరబిందో ఫార్మా సబ్సిడరీ సంస్థ అయిన యూగియా ఫార్మా స్పెషాలిటీస్ లిమిటెడ్ అనుతి సంపాదించింది. ఇది ఫైజర్‌కు చెందిన డెపో-ప్రొవేరా అనే బ్రాండుకు జనరిక్ ఔషధం. గత ఏడాది కాలంలో యూఎస్‌లో ఈ ఔషధం 62 మిలియన్ డాలర్ల అమ్మకాలు నమోదు చేసినట్లు తెలిసింది. మెడ్రాగ్జిప్రోస్టెరాన్ ఆసిటేట్ ఇంజక్షన్‌ను యూఎస్‌లో ఈ ఏడాది అక్టోబరు-డిసెంబరు త్రైమాసికంలో విడుదల చేయాలని బావిస్తున్నట్లు అరబిందో ఫార్మా వెల్లడించింది. ఇది మహిళల్లో హార్మోన్ల చికిత్సకు వినియోగించే ఔషధం.






