ఎయిర్ ఇండియాకు భార్ షాక్..
టాటా-గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. అయితే ప్రయాణికులకు రిఫండ్లు చెల్లించడంలో ఎయిర్ ఇండియా జాప్యం చేస్తోందని, తక్షణమే ఆ సంస్థ 121.5 మిలియన్ల డాలర్ల రిఫండ్ చెల్లించాలని అమెరికా ఆదేశించింది. పెనాల్టీ రూపంలో మరో 1.4 మిలియన్ల డాలర్లు ఇవ్వాలంటూ అమెరికా తన ఆదేశాల్లో పేర్కొన్నది. కరోనా మహమ్మారి సమయంలో ఆకస్మికంగా విమానాలు రద్దు చేయడం వల్ల ప్రయాణికులు ఫిర్యాదు చేశారు. తమకు చెల్లించాల్సిన రిఫండ్ ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. అమెరికా రవాణాశాఖ తాజా ఆదేశాలు జారీ చేసింది. ఎయిర్ ఇండియాతో పాటు మరో ఆరు ఎయిర్‌లైన్ సంస్థలకు ఈ ఫైన్ విధించింది. అయితే రిఫండ్ విధానంలో అమెరికా, ఎయిర్ ఇండియా పాలసీలో తేడాలు ఉన్నాయి. కరోనా మహమ్మారి సమయంలో ఎయిర్ ఇండియూకు సంస్థ అప్పటి టాటా సంస్థ టేకోవర్ తీసుకోలేదు.






