అరబిందో ఔషధానికి అమెరికా అనుమతి
గుండె జబ్బులకు చికిత్సలో వినియోగించే వసోప్రెస్సిన్ ఇంజక్షన్‌ను అరబిందో ఫార్మా యూఎస్ మార్కెట్లో విక్రయించనుంది. ఈ ఔషధానికి యూఎస్ఎఫ్డీఏ (అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ) నుంచి అరబిందో ఫార్మా అనుబంద సంస్థ యూగియా ఫార్మా మార్కెటింగ్ అనుమతి సంపాదించింది. పార్ స్టెరైల్ ప్రోడక్ట్స్ ఎల్ఎల్సీ, అనే సంస్థకు చెందిన వసోస్ట్రిక్ట్ బ్రాండుకు వసోప్రెస్సిన్ బయో ఈక్వలెంట్ ఔషధం, ఇక్వియా అనే సంస్థ గణాంకాల ప్రకారం యూఎస్ మార్కెట్లో ఈ ఔషధం గత ఏడాది కాలంలో 606 మిలియన్ డాలర్లు అమ్మకాలు నమోదు చేసింది. వసోప్రెస్సిన్ ఇంజక్షన్‌ను వెంటనే యూఎస్ మార్కెట్లో విడుదల చేయనున్నట్లు అరబిందో ఫార్మా వెల్లడించింది.






