ఈఫిల్ సందర్శనకు .. ఇకపై యూపీఐతో

ఫ్రాన్స్‌లోని ఈఫిల్ టవర్‌ను సందర్శించాలనుకునే దేశీ పర్యాటకులు భారత్‌లో రూపొందిన యూపీఐ (ఏకీకృత చెల్లింపుల విధానం) ద్వారా చెల్లించి, ట్రిప్‌ను బుక్ చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించి ఫ్రాన్స్‌కి చెందిన ఈ-కామర్స్ దిగ్గజం లైరాతో ఎన్‌పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ (ఎన్‌ఐపీఎల్) ఒప్పందం కుదుర్చుకుంది. దీనితో భారత టూరిస్టులు యూపీఐ క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేసి, ఆన్ లైన్‌లో ఈఫిల్ టవర్ సందర్వన టికెట్లను బుక్ చేసుకోవచ్చని ఎన్‌ఐపీఎల్ తెలిపింది.