2021లో ఘటన.. ఇప్పుడు బయటపడింది

టెస్లా ఎలక్ట్రిక్ కార్ల కంపెనీకి చెందిన ఓ ఇంజనీర్‌పై అసెంబ్లింగ్ రోబో దాడి చేసింది. 2021లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు బయటపడింది. అమెరికాలోని ఆస్టిన్‌కు సమీపంలో ఉన్న దిగా టెక్సాప్ ఫ్యాక్టరీలో ఇంజనీర్లు రోబోలకు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేస్తుండగా ఈ దాడి జరిగింది. అప్‌గ్రేడింగ్ సమయంలో రోబోలను స్విచాఫ్ చేస్తారు. కానీ ఆరోజు పొరపాటు ఎక్కడ జరిగిందోగానీ తనను అప్‌డేట్ చేస్తున్న ఇంజనీర్‌ను రోబో గట్టిగా పట్టుకుని, నేలకు అదిమిపెట్టింది. టెస్లా కారులోని అల్యూమినియం బాగాలను గట్టిగా పట్టుకుని, ముందుకు పంపే పనిచేసే రోబో కావడంతో దాడి సమయంలో రోబో వేళ్లు ఆ ఇంజనీర్ వీపు భాగంలో, ఎడమ చేతిలో దిగి రక్తం వచ్చింది. అక్కడే ఉన్న మరో ఇద్దరు ఇంజనీర్లు ఎమర్జెన్సీ స్టాప్ బటన్ నొక్కడతో రోబో అతణ్ని వదిలేసింది. దీనిపై ట్విటర్ యూజర్ ఒకరు టెస్లా చీప్ ఎలన్ మస్క్‌ను ప్రశ్నించగా అలాంటి ఇండస్ట్రియల్ కుకా రోబో ఆర్మ్స్ అని పరిశ్రమల్లోనూ ఉంటాయని, రెండేళ్ల క్రితం నాటి ఓ ఘటనపై ఇప్పుడింత రాద్ధాంతం చేయడం సిగ్గుచేటు అంటూ మండిపడ్డారు.