ఐటీ రంగంలో అద్భుతమైన ప్రగతి : కేటీఆర్
తెలంగాణ ఐటీ రంగం జాతీయ సగటు కన్నా మెరుగైన వృద్ధిరేటు నమోదు చేసిందని ఐటీశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. జాతీయ సగటు వృద్ధిరేటు 8.09 శాతం ఉంటే, తెలంగాణలో 17.97 శాతంగా నమోదైందని పేర్కొన్నారు. కరోనా సంక్షోభంలోనూ ఐటీ శాఖ అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. ఐటీ శాఖ ఆరో వార్షిక ప్రగతి నివేదికను మంత్రి కేటీఆర్ విడుదల చేశారు. గత ఏడాదితో పోలిస్తే దేశంలో తెలంగాణ ఐటీ ఎగుమతుల వాటా 10.61 శాతం నుంచి 11.58 శాతానికి పెరిగిందన్నారు. తెలంగాణ ఉద్యోగ వృద్ధిరేటు 7.2 శాతంగా ఉందని వివరించారు. 2020ని ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ ఏడాదిగా ప్రకటించామని, ఈ విభాగంలో సంస్థలతో ఇప్పటికే ఎనిమిది ఒప్పందాలు చేసుకున్నామన్నారు.
తెలంగాణలో 250కి పైగా సంస్థలు 1.16 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాయని, 2019లో రూ.7,337 కోట్ల పెట్టుబడులు వచ్చాయని వివరించారు. వన్ప్లస్ సంస్థ రూ.1000 కోట్ల పెట్టుబడితో అతిపెద్ద పరిశోధన, అభివృద్ధి సంస్థలను హైదరాబాద్లో ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిందని తెలిపారు. టాస్క్ ద్వారా 3.5 లక్షల మంది యువకులకు శిక్షణ ఇచ్చామని, దాదాపు 4,500 మంది ప్రత్యక్షంగా నియామకాలు పొందారన్నారు. కరోనా నేపథ్యంలో టీవర్క్ సం•్థ• తక్కువ ధరతో వెంటిలేటరు తయారు చేసిందన్నారు. టీశాట్ ద్వారా 4,612 కార్యక్రమాలను ప్రసారం చేశామని, యూట్యూబ్లో టీశాట్ కార్యక్రమాలకు వీక్షకుల సంఖ్య 5.3 కోట్లు దాటిందన్నారు.
డిజిటల్ మీడియా విభాగం తరపున తె
లుగు వికీపీడియా కోసం ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ ఆధ్వర్యంలో 30 లక్షల వ్యాపార లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. తెలంగాణ వ్యాలెట్ ద్వారా 11 లక్షల రిజిస్ట్రేషన్లు జరిగాయని, రూ.6,795 కోట్ల నగదు లావాదేవీలు నిర్వహించామన్నారు. వీహబ్ ద్వితీయ, తృతీయశ్రేణి పట్టణాల్లోని అతివలకు సహాయం చేస్తోందని కేటీఆర్ తెలిపారు.






