భారత్ జీ-7 దేశాలతో కలవకపోతే… మరింత డిస్కౌంట్
ప్రస్తుతం ఇస్తున్న డిస్కౌంట్ కంటే మరింత తక్కువ ధరకు భారత్‌కు ముడి చమురు సరఫరా చేసేందుకు రష్యా ముందుకొచ్చింది. ఇందుకు ప్రతిగా తమ చమురు ధరకు పరిమితులు పెట్టాలన్న జీ-7 దేశాల ప్రతిపాదనకు భారత్ మద్దతు పలకకూడదని రష్యా కోరినట్లు సమాచారం. రష్యా ప్రస్తుతం భారత్‌కు ఇతర దేశాల కంటే బ్యారల్‌కు ఆరు డాలర్ల తక్కువ ధరతో ముడి చమురు సరఫరా చేస్తోంది. భారత్ జీ-7 దేశాలతో కలవకపోతే మరింత డిస్కౌంట్ ఇచ్చేందుకు రష్యా ప్రతిపాదించినట్లు సమాచారం. ఈ ప్రతిపాదనపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని అధికార వర్గాలు తెలిపాయి. ఈ ఎగుమతుల ధరను తన కరెన్సీ రూబుల్స్‌లోనే చెల్లించాలని రష్యా కోరడం ఇందుకు పెద్ద ఇబ్బందిగా మారిందన్నారు.






