‘జూమ్’కు పోటీగా జియో నుంచి ‘జియోమీట్’
దేశంలో డిజిటవ్ వాడకం పెరుతోంది. వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ జూమ్‌కు పోటీగా ‘జియోమీట్’ అనే ఉచిత వీడియో-కాన్ఫరెన్సింగ్ అప్లికేషన్‌ను రిలయన్స్ జియో విడుదల చేసింది. ఏప్రిల్‌లో నాలుగో క్వార్టర్ సందర్భంగా జియో ఈ యాప్‌ను ప్రకటించగా, తాజాగా ఇప్పుడు అందరికీ ఇది అందుబాటులోకి వచ్చింది. ఈ ‘జియోమీట్’ ద్వారా 100 మంది ఒకే సారి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనే అవకాశం ఉంది. ఈ యాప్‌ను మొబైల్ నెంబర్ లేదా ఈ మెయిల్ ఐడీ ద్వారా సులభంగా లాగిన్ చేయవచ్చు. రిలయన్స్ జియోమీట్‌ను ఆండ్రాయిడ్, ఐఓఎస్ యాప్స్ ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు. విండోస్, మ్యాక్‌కు కూడా జియోమీట్ యాప్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ యాప్ కొంతకాలంపాటు బీటా వెర్షన్లో అందుబాటులో ఉండనుంది.






