చరిత్ర సృష్టించిన రిలయన్స్
ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది. ఈ సంస్థ మార్కెట్ విలువ సోమవారం రూ.11.5 లక్షల కోట్ల మార్క్‌ను క్రాస్ చేసింది. ఈ మార్క్‌ను దాటిన తొలి దేశీయ కంపెనీగా చరిత్ర సృష్టించింది. సోమవారం బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బిఎస్ఈ)లో ఆర్ఐఎల్ స్టాక్ 3.75 శాతం పెరిగి రూ.1,855కు చేరుకుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) షేరు విలువ పెరగడంతో కంపెనీ మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.12,47,729,40 కోట్లకు చేరింది. దేశంలోనే అత్యంత విలువైన సంస్థ అయిన ఆర్ఐఎల్ జూన్‌లోనే రూ.11 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ను సాధించి, ఈ మైలురాయిని చేరుకుని దేశంలోనే మొట్టమొదటి సంస్థగా నిలించింది.






