లండన్ లో వేలానికి అరుదైన రూ.10 నోట్లు

రెండు అరుదైన రూ.10 నోట్లను నూనన్స్ మేఫర్ వేలం సంస్థ లండన్‌లో వచ్చే బుధవారం వేలం వేయనుంది. 1918 జులై 2న ముంబయి నుంచి లండన్ వెళుతున్న ఓడ మునిగిపోగా ఈ జత నోట్లు సముద్రంలో తేలాయి. ఇవి వేలంలో 2,000-2,600 (రూ.2.11లక్షల నుంచి 2.74 లక్షలు) పౌండ్ల ధర పలకవచ్చని భావిస్తున్నారు.