12 ఏండ్లకు అదృష్టం.. లాటరీలో 8 కోట్ల జాక్ పాట్

ఏటా క్రమం తప్పకుండా దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలినియమ్ డ్రా లాటరీ టికెట్ కొనే పాయల్ అనే పంజాబ్ మహిళను 12 ఏండ్లకు అదృష్టం వరించింది. పెండ్లి రోజు సందర్భంగా భర్త ఇచ్చిన నగదు బహుమతితో టికెట్ కొన్న ఆమెకు ఏకంగా రూ.8.3 కోట్ల జాక్‌పాట్ తగిలింది. లాటరీ కంపెనీ ప్రతినిధులు ఆమె భర్తకు ఈ విషయంలో ఫోన్‌లో చెప్పినప్పుడు ఆమె ఉబ్బితబ్బిబయ్యారు. ప్రతిసారీ దుబాయ్ ఎయిర్‌పోర్టులో టికెట్ కొనేదాన్ని. ఈ ఏడాది ఆన్‌లైన్లో కొన్నాను. 3 అంకెల ఎక్కువగా కలిగిన నెంబర్ కలిగిన టికెట్‌ను తీసుకున్నా. ఈ డబ్బులో ఎక్కువ భాగం నా కవల పిల్లల చదువు కోసం ఉపయోగిస్తా. కొత్త మొత్తాన్ని పంజాబ్ సమాజానికి సేవ చేయడానికి, కొంత ఆస్ట్రేలియాలోని నా సోదరుడికి ఇస్తాను అని పాయల్ పేర్కొన్నారు.