వేలానికి డయానా వ్యక్తిగత లేఖలు

బ్రిటన్ మాజీ యువరాణి డయానాకు సంబంధించిన కొన్ని వస్తువులను ఈ నెల 27న వేలం వేయనున్నారు. ఇందులో ఆమె తన వ్యక్తిగత సహాయకుడికి రాసిన లేఖలు కూడా ఉన్నాయి. డయానా తన వ్యక్తిగత విషయాలు, తన జీవితంలోని మధుర క్షణాలు, పలు అనుభవాలు లేఖల్లో పంచుకున్నారు. డయానాకు 1981లో ప్రిన్స్ చార్లెస్‌తో వివాహం అయిది. 1996లో ఆమె విడాకులు తీసుకున్నారు. మరుసటి ఏడాది 36 ఏండ్ల వయసులో డయానా కారు ప్రమాదంలో మరణించారు.