ఇకపై భారతీయులకు అక్కడ… ఫోన్ పే సేవలు

ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ ఫోన్‌పే కొత్తగా తన సేవలను శ్రీలంకకు విస్తరించినట్లు ప్రకటించింది. ఆ దేశంలో లంకాపేతో కలిసి సేవలను అందించనున్నట్లు వెల్లడించింది. ఇకపై భారతీయులు అక్కడ ఫోన్ పే యాప్‌తో లంకా పే క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేసి చెల్లింపులు చేయవచ్చని తెలిపింది భారత పర్యాటకులు శ్రీలంక అంతటా యూపిఐ సేవలను వినియోగించుకోవచ్చుని పేర్కొంది. కరెన్సీ మారకం రేటును చూపుతూ మొత్తం భారత రూపాయిలో డెబిట్ అవుతుందని వెల్లడించింది. శ్రీలంక వెళ్లే భారతీయ పర్యాటకులకు సురక్షితమైన చెల్లింపు పద్దతిని ఉపయోగించి లావాదేవీలు జరపవచ్చని ఫోన్‌పే ఇంటర్‌నేషనల్ పేమెంట్స్ సిఈవో రితేష్ పాయ్ తెలిపారు. ఇది ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ శ్రీలంక గవర్నర్ నందలాల్ వీరసింగ్ పేర్కొన్నారు.