ఈ నిర్ణయంతో భారత్‌పై ఎలాంటి ఒత్తిడి లేదు
చమురు ఎగుమతిలో ఆదాయం పొందుతున్న రష్యాకు అడ్డుకట్ట వేసేందుకు జి-7 దేశాలు ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. ఇందులో భాగంగా చమురు ధరపై పరిమితులు విధించేందుకు సిద్దమయ్యాయి. ఈ నిర్ణయంతో భారత్‌పై ఎలాంటి ఒత్తిడి ఉండదని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురి స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌పై యుద్ధం కొనసాగుతున్న వేళ రష్యాపై పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధిస్తున్నప్పటికీ భారత్ మాత్రం మాస్కో నుంచి చౌక ధరకే ఇంధనాన్ని దిగుమతి చేసుకుంటోంది. ఈ క్రమంలో రష్యా చమురు ధరపై పరిమితి విధించాలని జి`7 దేశాలు నిర్ణయించాయి. నిర్ణీత ధరకు, లేదా అంతకంటే తక్కువకు విక్రయిస్తేనే సరఫరాకు అనుమతించి, బీమాను వర్తింపజేయాలని నిర్ణయించాయి. అయితే ఈ ధర పరిమితి ప్రణాళికలో చేరే దేశాలకు ఇంధన సరఫరాను నిలిపివేస్తామని రష్యా హెచ్చరించింది.






