Natco :అమెరికా మార్కెట్‌కు నాట్కో ఔషధం

నాట్కో ఫార్మా అమెరికా మార్కెట్ (American market )లో కొత్త జనరిక్ ఔషధాన్ని విడుదల చేసింది. పిల్లల్లో వచ్చే బీపీ నియంత్రణ కోసం బొసెంటాన్ (Bosentan) పేరుతో 32 ఎంజీ డోసేజిలో ఈ టాబ్లెట్లను విడుదల చేసినట్టు కంపెనీ రెగ్యులేటరీ సంస్థలకు తెలిపింది. ట్రక్లీర్ పేరుతో అమెరికన్ కంపెనీ యాక్టెలియన్ ఫార్మాస్యూటికల్స్ మార్కెట్ చేస్తున్న బ్రాండెడ్ టాబ్లెట్లకు, బొసెంటాన్ టాబ్లెట్లు జనరిక్ వెర్షన్ (Generic version). అమెరికా మార్కెట్లో తమ బొసెంటాన్ టాబ్లెట్లకు 180 రోజుల పాటు ప్రత్యేక మార్కెటింగ్ హక్కులుంటాయని కంపెనీ తెలిపింది.