గేట్స్ ఫౌండేషన్ నుంచి వైదొలగిన మెలిందా

ప్రపంచ ప్రసిద్ధి చెందిన బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్ కో చైర్ పదవికి మెలిందా ఫ్రెంచ్ గేట్స్ రాజీనామా చేశారు. మాజీ భర్త బిల్‌గేట్స్‌తో కలిసి ఈ స్వచ్ఛంద సంస్థను ఆమె నెలకొల్పి గత ఇరవై ఏళ్ల వ్యవధిలో ప్రపంచంలో అతిపెద్ద సేవా సంస్థల్లో ఒకటిగా తీర్చిదిద్దారు. మూడేళ్ల క్రితం వీరు విడాకులు తీసుకున్నారు. ప్రపంచంలో అసమానతలు తొలగించడానికి ఫౌండేషన్ చేస్తున్న అసాధారణ కృషి తనకెంతో గర్వకారణమని ఆమె పేర్కొన్నారు. 2021లో బిల్‌గేట్స్‌తో తాను విడాకులు ప్రకటించిన తర్వాత సంస్థను గణనీయంగా విస్తరించిన సీఈవోను, బోర్డ్ ఆఫ్ ట్రస్టీలను ఆమె కొనియాడారు. వితరణలో తదుపరి అధ్యాయానికి వెళ్లడానికి తనకు ఇది సరైన సమయమని పేర్కొన్నారు. మెలిందా సేవలకు బిల్‌గేట్స్ కృతజ్ఞతలు తెలిపారు.