ప్రపంచంలోనే రెండోస్థానం.. భారత సంతతి సీఈవోకు వేతనం 1.261 కోట్లు

ప్రపంచంలో అత్యధిక వేతనం పొందుతున్న సీఈవోల్లో భారత సంతతికి చెందిన వారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. ఢిల్లీ ఎయిర్‌ఫోర్సు పబ్లిక్ స్కూల్‌లో చదువుకున్న నికేశ్ అరోరా, ఇప్పుడు ప్రపంచంలో అత్యధిక వేతనం అందుకుంటున్న రెండో సీఈవోగా నిలిచారు. సుందర్ పిచాయ్, మార్క్ జుకర్‌బర్గ్ తదితరులు ఆయన తర్వాత ఉండటం గమనార్హం. 2023 ఏడాదికి సంబంధించచి అత్యధిక వేతనాలు పొందుతున్న టాప్ సీఈవోల జాబితా విడుదలైంది. బ్రాడ్‌కామ్స్ సీఈవో హాక్‌టాన్ ( 162 మిలియన్ డాలర్లు) తర్వాత నికేశ్ అరోరా రెండో స్థానంలో ఉన్నారు.
అమెరికాలో సైబర్ కంపెనీ పాలో ఆల్టో నెట్‌వర్క్స్ సీఈవోగా నికేవ్ అరోరా 151.43 మిలియన్ డాలర్ల (రూ.1,261 కోట్లు) వేతన ప్యాకేజీని అందుకుంటున్నారు. గూగుల్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్‌గా నికేశ్ అరోరా తొలుత ఇండస్ట్రీలో తనదైన ముద్రవేశారు. 2014లో ఆ సంస్థను వీడి జపాన్‌లోని ప్రముఖ బ్యాంక్ లో కీలక బాధ్యతలు చేపట్టారు. 2018లో పాలో ఆల్టో నెట్‌వర్క్ సీఈవోగా చేరారు.