ఫార్చ్యూన్ జాబితాలో ప్రవాస భారతీయులు
ఫార్చ్యూన్ మ్యాగజైన్ తన వార్షిక అండర్ 40 జాబితాను విడుదల చేసింది. ప్రతిభావంతులైన వ్యాపారవేత్తలపై ఈ జాబితా దృష్టిసారించింది. 2022 సంవత్సరం జాబితాలో వ్యవస్థాపకులు, కార్యనిర్వాహకులు, పెట్టుబడిదారులు అవకాశాలను సృష్టిస్తున్నారు. ఇతరులకు సాధికారత కల్పిస్తున్నారు. మిలియన్ల మందిని ప్రభావితం చేసే వ్యాధులకు కొత్త చికిత్సలను అన్వేషిస్తున్నారు. అథ్లైట్లు, ఎంటర్టైనర్లుగా కొత్త విజయాలను సాధిస్తున్నారు. 40 ఏళ్లలోపు వారిని టాప్-40 వర్గంగా విజించి ఫార్యూన్ జాబితా రూపొందించబడింది. ఈ జాబితాలో ఇద్దరు భారత సంతతి వ్యవస్థాపకులకు గుర్తింపు లభించింది. కనవ్ కరియా, అంకిత్ గుప్తా ఫార్చ్యూన్ అండర్ 40 జాబితా 2022 ఎడిషన్‌లో చోటు దక్కించుకున్నారు. ఇందులో ప్రముఖ కళాకారిణి రిహానా ప్రపంచంలో అత్యధికంగా అనుసరించే టిక్‌టోకర్ ఖాబీ లేమ్ కూడా ఉన్నారు. 26 ఏళ్ల కనన్ కరియా జంప్ క్రిప్టో అధ్యక్షుడిగా ఉన్నారు. 35 ఏళ్ల అంకిత్ గుప్తా సైకిల్ హెల్త్ వ్యవస్థాపకుడు. ఫార్చ్యూన్ ప్రకారం, కనవ్ కరియా క్రిప్టో కంపెనీల కోసం జంప్ ట్రేడిరగ్ స్టార్టప్ ఇంక్యుబేటర్‌లో ఇంటర్న్‌గా ప్రారంభించబడింది.






