మాల్దీవులకు భారత ఆపన్న హస్తం

మాల్దీవుల ప్రభుత్వ ప్రత్యేక వినతి మేరకు 50 మిలియన్ యూఎస్ డాలర్ల సాయాన్ని మరో ఏడాది పొడిగిస్తూ భారత్ నిర్ణయం తీసుకుంది. ఆరు నెలల క్రితం మాల్దీవుల అధ్యక్షుడిగా మహ్మద్ ముయిజ్జు బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రెండు దేశాల మధ్య సంబంధాలు క్షీణించినా భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో మాల్దీవుల ప్రభుత్వం భారత్ సహకారానికి ధన్యవాదాలు తెలిపింది. మాల్దీవులకు కీలకమైన బడ్జెటరీ సాయం అందించినందుకు భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్. జైశకంర్, భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు. రెండు దేశాల మధ్య ఉన్న దీర్ఘకాల స్నేహానికి ఇది చిహ్నం అని మాల్దీవుల విదేశాంగ శాఖ మంత్రి మూసా జమీర్ అన్నారు.