America :అమెరికా విషయంలో ఇది మరోసారి రుజువు : మధు నాయర్
చరిత్రలో అప్పుల భారంతో ఉన్న రాజ్యాలన్నీ ఏదో ఒక దశలో ఇబ్బందిని ఎదుర్కొన్నాయని, అమెరికా విషయంలో ఇది మరోసారి రుజువు అవుతోందని యూనియన్ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ ( యూనియన్ ఏఎంసీ) మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ మధు నాయర్ (Madhu Nair) అన్నారు. సెప్టెంబరు 1 నుంచి రాబోతున్న యూనియన్ డైవర్సిఫైడ్ ఈక్విటీ ఆల్ క్యాప్ యాక్టివ్ ఎఫ్‌ఓఎఫ్ పథకంపై ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ట్రంప్ (Trump) విధించిన సుంకాల వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అమెరికా కాస్త బలహీనం అయ్యే ఆస్కారం ఉందని పేర్కొన్నారు. ఇదే సమయంలో భారత్ (India) వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు దీర్ఘకాలంలో లాభదాయకమని అభిప్రాయపడ్డారు. స్వల్పకాలం లో మన ఈక్విటీ మార్కెట్లలో హెచ్చుతగ్గులు, అనిశ్చితి తప్పదని తెలిపారు. ప్రెస్తుతం అమెరికా 36 ట్రిలియన్ డాలర్ల రుణ భారంతో ఉంది. వడ్డీ భారం పెరుగుతోంది. దీన్ని ఎదుర్కోవడం ఆ దేశానికి సవాలుగా మారింది. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు డాలర్ విలువను తగ్గించడం లేదా ఆర్థిక సంస్కరణలు అవసరం. వీటిని హఠాత్తుగా చేయడం సాధ్యం కాదు అని వివరించారు.







