Jio Hotstar : జియో యూజర్లకు గుడ్‌న్యూస్ … ఏప్రిల్ 15 వరకు

ఐపీఎల్‌ను పురస్కరించుకుని ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో (Reliance Jio) ప్రకటించిన అన్‌లిమిటెడ్ ఆఫర్‌ను పొడిగించింది. 90 రోజుల ఫ్రీ జియో హాట్‌స్టార్ (Jio Hotstar), జియో ఫైబర్ పై 50 రోజుల ఫ్రీ ట్రయల్ ఆఫర్ (Free trial offer) గడువును పెంచింది. మార్చి 31 వరకు మాత్రమే ఈ ప్రయోజనా లను అందిస్తామని రిలయన్స్ తొలుత ప్రకటించినా దాన్ని తాజాగా ఏప్రిల్ 15 వరకు పొడిగించింది. ఐపీఎల్ మ్యాచ్ (IPL match )లను ఉచితంగా వీక్షించేందుకు గానూ రిలయన్స్ జియో మార్చి 17న ఈ ఆఫర్‌ను ప్రకటించింది. ఎవరైతే రూ.299, అంతకంటే ఎక్కువ మొత్తంలో రీఛార్జి చేస్తారో వారికి 90రోజుల పాటు జియో హాట్‌స్టార్‌ను ఉచితంగా అందిస్తామని తెలిపింది. మొబైల్ డివైజులతో పాటు టీవీ (TV) ల్లోనూ వీక్షించే సదుపాయం కల్పించింది. ప్రస్తుత కస్టమర్లతో పాటు కొత్తగా చేరే జియో కస్టమర్లకూ ఈ అవకాశం ఇచ్చింది.