Chandrababu: ఆస్తి, ప్రాణ నష్టం లేకుండా చేశాం : చంద్రబాబు
మొంథా తుపాను కారణంగా ఆస్తి, ప్రాణ నష్టం లేకుండా చేశామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అన్నారు. మొంథా తుపానులో ఉత్తమ సేవలందించిన వారి కోసం సీఎం క్యాంపు కార్యాలయం లో అభినందన కార్యక్రమం నిర్వహించారు. పలువురిని సైక్లోన్ మొంథా ఫైటర్లుగా గౌరవిస్తూ సర్టిఫికెట్లు, జ్ఞాపికలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ తుపానుపై సమాచారాన్ని ముందుగానే ఇచ్చి ప్రజలకు అవగాహన కల్పించాం. పర్చూరు వాగులో కొట్టుకుపోతున్న వ్యక్తిని డ్రోన్(Drone) ద్వారా గుర్తించి కాపాడాం. ప్రార్థనా మందిరం చుట్టూ వరద నీరు వస్తే 15 మందిని కాపాడాం. వరద నీటిని తొలగించే పనులు వేగంగా జరిగాయి. సాంకేతికతతో పాటు అధికార యంత్రాంగం , ప్రజాప్రతినిధులు సహకరించారు. రాష్ట్రానికి రెండు సమస్యలు, రాయలసీమ కరవు, కోస్తాంధ్రకు తుపాన్లు, సమర్థ నీటి నిర్వహణ, ప్రాజెక్టుల నిర్మాణంతో రాయలసీమ (Rayalaseema) లో కరవు లేకుండా చేశాం. ఈసారి మొంథా తుపానుపై అధికారులతో బృందం సిద్దం చేశాం. వారికి సాంకేతిక సపోర్టు ఇచ్చాం. అద్భుతంగా పనిచేశారు. పరిస్థితిని సమీక్షించి రియల్ టైమ్‌లోనే హెచ్చరికలు పంపాం. వర్ష ప్రభావం, గాలుల తీవ్రతను టెక్నాలజీతో పర్యవేక్షించాం. ముందస్తు జాగ్రత్తలు, హెచ్చరికలు పంపి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చూశాం అని తెలిపారు.







