ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్ కు భారీ నష్టం
అమెరికా ద్రవ్యోల్బణం గణాంకాలు అక్కడి మార్కెట్లతో పాటు, ప్రపంచ మార్కెట్లను అతలాకుతలం చేశాయి. మార్కెట్లు భారీ నష్టాలను ఎదుర్కొన్నాయి. ఫలితంగా అమెరికా అపర కుబేరులైన అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్‌కు మన కరెన్సీలో 77 వేల కోట్లు, టెస్లా అదినేత ఎలాన్ మస్క్‌కు 66 వేల కోట్ల నష్టం వచ్చింది. ఆయా కుబేరుల కంపెనీల షేర్ల ధరలు పతనకం కావడం వల్ల వారి సంపద విలువ ఆ మేకు తగ్గింది. బ్లూమ్‌బర్గ్ సూచీ గణాంకాల ప్రకారం ఒక్క రోజులోనే అమెరికా బిలియనీర్ల సంపద 93 బిలియన్ డాలర్ల మేర నష్టపోయారు. మన కరెన్సీలో చూస్తే 7.3 లక్షల కోట్లకు పైగానే వీరి సంపద తగ్గింది.
అమెరికా స్టాక్ మార్కెట్ చరిత్రలో ఇలా ఒకే రోజు ఇంత భారీగా నష్టపోవడం ఇది తొమ్మిదో సారి అని బ్లూమ్‌బర్గ్ తెలిపింది. వీరితో పాటు గూగుల్ వ్యవస్థాపకులు లారీ పేజ్, సెర్గీ బ్రిన్, మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్, మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో స్టీవ్ బాల్మెర్ నాలుగు బిలియన్ డాలర్ల చొప్పున నష్టపోయారు. వారెన్ బఫెట్ సంపద 3.4 బిలియన్ డాలర్లు, బిల్‌గేట్స్ సంపద 2.8 బిలియన్ డాలర్ల మేర నష్ట పోయారు.






