గడియారాన్ని నిర్మించడానికి జెఫ్ బెజోస్ రూ.350 కోట్లు

పదివేల సంవత్సరాలు నడిచే 500 అడుగుల భారీ గడియారాన్ని నిర్మించేందుకు ప్రముఖ ఈ-కామర్స్ కంపెనీ అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ 42 మిలియన్ డాలర్లు ( రూ.350 కోట్లు ) కేటాయించారు. కంప్యూటర్ సైంటిస్టు, ఇన్వెంటర్ డానీ హిల్స్ ఆలోచనలోంచి పుట్టిన ఈ ప్రాజెక్ట్ ద క్లాప్ ఆఫ్‌ద లాంగ్ నౌ. ఏడాదికి ఒకమారు టిక్ అంటూ శబ్ధం చేస్తుంది. ఈ యాంత్రిక గడియారాన్ని లాంగ్ న్యూఫౌండేషన్ అనే సంస్థ టెక్సాస్ కొండలపై ఏర్పాటు చేయనుంది. ఒక గది పరిమాణంలో ఉండే ఐదు ఛాంబర్‌లు ఈ గడియారంలో ఉంటాయి. మొదటి ఏడాది `మొదటి ఛాంబర్ 10వ ఏడాది రెండో ఛాంబర్, 100వ ఏడాది మూడో ఛాంబర్, 1000వ ఏడాది నాలుగో ఛాంబర్, 10 వేల సంవత్సరం `ఐదో ఛాంబర్‌కు కేటాయించారు. ఆయా కాలాల్లో మానవ చరిత్రని తెలిపే కళాఖండాలు, సందేశాలు తదితర అంశాల్ని ఇందులో పొందుపరుస్తారు.