నిప్పన్ స్టీల్ చేతికి యూఎస్ స్టీల్

అమెరికా పారిశ్రామికీకరణలో కీలక పాత్ర పోషించిన యూఎస్ స్టీల్‌ను నిప్పన్ స్టీల్ కొనుగోలు చేయబోతోంది. మొత్తం నగదు ద్వారా ఈ లావాదేవీ జరగనుంది. 14.1 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.1.17 లక్షల కోట్లు) విలువైన ఈ లావాదేవీలో కంపెనీ అప్పులు కూడా కలిసి ఉన్నాయి. కొనుగోలు అనంతరం ఏర్పడే సంయుక్త సంస్థ ప్రపంచంలోనే అతిపెద్ద ఉక్కు తయారీ కంపెనీల్లో ఒకటిగా నిలవనుందని వరల్డ్ స్టీల్ అసోసియేషన్ నుంచి లభించిన 2022 గణాంకాల ఆధారంగా తెలుస్తోంది. క్లీవ్ లాండ్ క్లిప్స్ నుంచి నాలుగు నెలల కిందట యూఎస్ స్టీల్‌కు ఆఫర్ వచ్చింది. దానిని ఆది తిరస్కరించింది. దీంతో పోలిస్తే ప్రస్తుతం నిప్పన్ స్టీల్ రెట్టింపు ఆఫర్ ఇవ్వడం విశేషం. కాగా కొనుగోలు అనంతరం యూఎస్ స్టీల్ పేరును కొనసాగించనున్నారు. నిప్పన్‌కు అనుబంధ సంస్థగా ఉంటుంది.