దేశ ప్రజల సంక్షేమం కోసమే… ఉత్తమ డీల్
రష్యా నుంచి తక్కువ ధరకే ఇంధనాన్ని కొనుగోలు చేస్తున్న అంశంపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ స్పందించారు. బ్యాంకాక్‌లో భారత్-థాయిలాండ్ సంయుక్త కమిషన్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలును సమర్థించారు. ఉక్రెయిన్‌తో యుద్ధం వల్ల చాలా వరకు కంపెనీలు తమ ఇంధనాన్ని యూరోప్ దేశాలకు సరఫరా చేస్తున్నాయని, ప్రస్తుతం రష్యా నుంచి యూరప్ తక్కువ స్థాయిలో ఇంధనాన్ని తీసుకుంటోందని తెలిపారు. ఇంధన ధరలు విపరీతంగా పెరిగాయని, అలాగే గ్యాస్ ధరలు కూడా అసాధారణ రీతిలో పెరుగుతున్నాయని, ఆసియా దేశాలకు ఇంధన సరఫరా చేసే సాంప్రదాయ దేశాలన్నీ ఇప్పుడు యూరోప్‌కు తరలిస్తున్నాయని తెలిపారు. దేశ ప్రజల సంక్షేమం కోసమే ఉత్తమ డీల్‌ను కుదుర్చుకున్నట్లు తెలిపారు. రక్షణాత్మక తీరులో భారత్ ఇంధనాన్ని కొనుగోలు చేయడం లేదన్నారు. దేశ ప్రయోజనాల విషయంలో చాలా ఓపెన్‌గా ఉన్నామని, దేశంలో తలసరి ఆదాయం రెండు వేల డాలర్లు ఉందని, ఇలాంటి ప్రజలు ఇంధనం కోసం అధిక అధరలు వెచ్చించలేరని తెలిపారు. ప్రజలకు తక్కువ ధరకే ఇంధనాన్ని అందిద్వడమే తన విధి, బాధ్యతగా భావిస్తానన్నారు.






