TikTok: భారత్‌లోకి మళ్లీ టిక్‌టాక్?
టిక్‌టాక్ సేవలు మళ్లీ భారత్‌లో అమల్లోకి రాబోతున్నాయంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఇందుకు కారణం ఐదేళ్లుగా కనిపించని టిక్‌టాక్ వెబ్‌సైట్ భారత్ (India) లో మొదటిసారి అనేక మందికి ఆన్‌లైన్‌లో అందుబాటులోకి రావడమే. ఈ విషయాన్ని కొందరు సోషల్ మీడియా (Social media) వేదికగా పంచుకోవడంతో పలు ఊహాగానాలకు దారితీసింది. ఏదేమైనా ప్లే స్టోర్(Play Store) లో ఇప్పటివరకు ఈ యాప్ అందుబాటులోకి రాలేదు. అలాగే టిక్‌టాక్ సేవలను భారత్‌లో తిరిగి ప్రారంభించే విషయమై మాతృసంస్థ బైట్‌డ్యాన్స్ (ByteDance) కంపెనీ కూడా ఏ ప్రకటన చేయలేదు. 2020 జూన్‌లో సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో భద్రతా పరమైన కారణాలతో టిక్‌టాక్‌తో పాటు చైనాకు చెందిన 58 యాప్‌లపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే.







