చెఫ్ వరుణ్ సహానీ కు అంతర్జాతీయ ప్రశంసలు
ఐటీ, ఫార్మా రంగాలకు అంతర్జాతీయంగా ఖ్యాతి పొందిన హైదరాబాద్‌ను పాకశాస్త్ర ప్రావీణ్య పటంలో నిలిపాడు. హైదరాబాద్‌కు చెందిన చెఫ్ వరుణ్ సహానీ. న్యూయార్క్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన జీన్జార్జ్ రెస్టారెంట్ల వార్షిక ప్రతిష్టాత్మక కార్యక్రమం రిలైస్ అండ్ చాటేక్స్ సమావేశం జరిగింది ఆతిథ్య విభాగానికి వరుణ్ నేతృత్వం వహించారు. ప్లేటింగ్ మొదలుకుని మొనూ వరకూ ప్రత్యేకత చాటుతూ వరుణ్ అందించిన ఆతిథ్యాన్ని ఉత్తర అమెరికా వ్యాప్తంగా పలు రెస్టారెంట్లు, హోటళ్ల జనరల్ మేనేజర్లు, చెఫ్‌లు ప్రశంసించారు. హైదరాబాద్‌లోని ట్రైడెండ్ హోటల్స్‌లో చెఫ్1గా కేరీర్ ప్రారంభించిన వరుణ్ ఆ తరువాత అమెరికాలోని కలినరీ ఇనిస్టూట్యూట్లో ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ పూర్తి చేశాడు. పాకశాస్త్రం పట్ల అభిరుచి కలిగిన వరుణ్ కొద్ది కాలంలోనే అత్యున్నత స్థానానికి చేరుకోవడం వివేషం.






