Infosys : ఉద్యోగులకు ఇన్ఫోసిస్ శుభవార్త

ఇన్ఫోసిస్ ఉద్యోగులకు శుభవార్త (Good news)ను అందించింది. మెరుగైన పనితీరు కనబరిచిన ఉద్యోగులకు 80 శాతం బోనస్‌ను సంస్థ ప్రకటించింది. ఏప్రిల్-జూన్ త్రైమాసికానికిగాను ఈ బోనస్ (Bonus) వర్తించనున్నదని తెలిపింది. మార్చితో ముగిసిన మూడు నెలలకాలంలో 50 శాతం నుంచి 70 శాతం వరకు బోనస్ చెల్లింపులు జరిపించిన సంస్థ, గడిచిన త్రైమాసికంలో దీనిని 75 శాతం నుంచి 89 శాతానికి సవరించింది. వ్యక్తిగత, గ్రూపు సిబ్బంది పనితీరు ఆధారంగా సంస్థ ఈ బోనస్ చెల్లింపులు జరుపుతున్నట్టు, ఈ విషయాన్ని ఆయా ఉద్యోగులకు ఈ-మెయిల్ (Email) రూపంలో సమాచారాన్ని అందించింది.